6, అక్టోబర్ 2015, మంగళవారం

॥గౌతమధర్మసూత్రాణి॥


         ‘ఓమ్‍ వేదో ధర్మమూలమ్‍’ అనే మొదటి సూత్రముచేత ధర్మమునకు వేదము మూలము అనగా ప్రమాణమని నిరూపించటమయినది. ఆపిదప ఏదైనా విషయములో  వేదవాక్యము ప్రమాణముగా దొరకకపోతే ఏమి చెయ్యలి అనే సంశయము వచ్చినపుడు మార్గమును రెండవసూత్రము ద్వారా చూపిస్తున్నారు.

మితాక్షరీ

            అథ యత్ర ప్రత్యక్షో వెదో మూలభూతో నోపపద్యతే తత్ర కథం -

ప్రతిపదార్థము - అథ = ఆ పిదప (మొదటి సూత్రనిరూపణము తరువాత), యత్ర = ఎక్కడైతే, ప్రత్యక్షో వేదః = ప్రత్యక్షమయినట్టి అనగా దొరుకుచున్నట్టి వేదవాక్యము, మూలభూతో = ఏదైనా విషయమునకు ఆధారభూతముగా, నోపలభ్యతే = దొరకనప్పుడు, తత్ర కథం = ఆ సమయమున ఏమి చెయ్యలి అని సంశయము రాగా

సూత్రమ్‍

తద్విదాఞ్చ స్మృతిశీలే॥2॥


ప్రతిపదార్థం - తద్విదాం = వేదవేత్తలయినటువంటి మన్వాదిమహానుభావిలయొక్క, స్మృతిశీలే = (వారిచే రచింపబడినటువంటి) ధర్మశాస్త్రములు మరియూ శిష్టాచారములు (ప్రమాణములు).

మితాక్షరీ

            తద్విదాం వేదవిదాం మన్వాదీనాం యా స్మృతిస్తత్ప్రణీతం ధర్మశాస్త్రం యచ్చ తేషాం శీలమనుష్ఠానం తే స్మృతిశీలే అస్మదాదీనాం ప్రమాణమ్‍। న చ తేషామనుష్ఠానం నిర్మూలం సమ్భవతి। సమ్భవతి చ వైదికానాముత్సన్నపాఠే వేదానుభవ ఇతి। తేషాం తు తదానీం విద్యమానత్వేన సమ్ప్రదాయావిచ్ఛెదాచ్చ వైదికానుష్ఠానం వేదమూలమేవ। యథా ఆహ ఆపస్తమ్బః
                        “తేషాముత్సన్నాః పాఠాః ప్రయొగాదనుమీయన్త” ఇతి॥2॥


ప్రతిపదార్థం తద్విదాం వేదవిదాం = వేదవేత్తలయినటువంటి; మన్వాదీనాం = మన్వదులయొక్క; యా స్మృతిః - ధర్మశాస్త్రం = యేదేతై స్మృతి అనగా వారిచెరచింపబడినటువంటి ధర్మశాస్త్రము; యచ్చ తేషాం శీలం అనుష్ఠానం = అలాగే వారిచే అనుష్ఠింపబడినటువంటి జీవనశైలి (శిష్టాచారము) ఉందొ; తే స్మృతిశీలే = అటువంటి స్మృతిశీలములు (ధర్మశాస్త్రశిష్టాచారములు); అస్మదాదీనాం = మనలకు; ప్రమాణం = ప్రమాణములు (ఆధారములు)। న చ తేషామనుష్ఠానం నిర్మూలం సమ్భవతి = మన్వాదులయొక్క వైదికకర్మానుష్ఠానము నిర్హేతుకమైనది కాదు। సమ్భవతి చ వైదికానాముత్సన్నపాఠే వేదానుభవ ఇతి = వైదికకర్మలను ఆచరించెడి మన్వాదులకు లుప్తమయిన వేదవాక్యములయొక్క స్ఫురణ కుదురుతుంది। తేషాం తు తదానీం = మన్వాదులకు ఆ సమయమున ( ధర్మసూత్రరచనాకాలమునందు [ఇప్పుడు ఉపలభ్యముకానటువంటి వేదవాక్యములు ఆకాలమున ఉపలభ్యమగుటకు ఆస్కారము ఉంది]); విద్యమానత్వేన = (వేదవాక్యములు) ఉపలభ్యమగుటవలన; సమ్ప్రదాయావిచ్ఛేదాచ్చ = కర్మానుష్ఠానముయొక్క సమ్ప్రదాయము అవిచ్ఛిన్నముగా ఉండుట వలన కూడా; వైదికానుష్ఠానం = వైదికకర్మలయొక్క అనుష్ఠానం; వేదమూలమేవ = వేదమును ఆధారముచేసుకున్నవే। యథా ఆహ ఆపస్తమ్బః = ఇదే విషయమును ఆపస్తమ్బమహర్షి కూడా ఇలా స్పష్టము చేసారు। తేషాం = వేదములయొక్క; ఉత్సన్నాః = లుప్తమయినటువంటి; పాఠాః = వాక్యములు; ప్రయోగాదనుమీయన్తే = అనుష్ఠానమువలన అనుమానింపబడుతాయి (అనుమానం = inference)