21, సెప్టెంబర్ 2015, సోమవారం

॥ శ్రీ శఙ్కరభగవత్పాదా విజయన్తే॥
॥ గోతమధర్మసూత్రాణి॥
ప్రథమప్రశ్నే ప్రథమోధ్యాయః
సూత్రం
ఓం వేదో ధర్మమూలమ్‍॥
మితాక్షరీ (హరదత్తకృతా)

నమో రుద్రాయ యద్ధర్మశాస్త్రం గౌతమనిర్మితమ్‍।
క్రియతే హరదత్తేన తస్య వృత్తిర్మితాక్షరీ॥

          కర్మజన్యోభ్యుదయనిఃశ్రేయసహేతురపూర్వాఖ్య ఆత్మగుణో ధర్మః। తస్య మూలం ప్రమాణమ్‍। వేదో మన్త్రబ్రాహ్మణాత్మకః। జాతావెకవచనమ్‍। చత్వారో వేదా ఋగ్యజుస్సామాత్మకాస్త ఏవ ధర్మే ప్రమాణమ్‍। న యోగిప్రత్యక్షం నానుమానం నార్థాపత్తిర్న శాక్త్యాద్యాగమః। తేన తన్మూలా ఏవోపనయనాదయో ధర్మా వక్ష్యన్తే న చైత్యవన్దనకేశోల్లుఞ్చనాదయ ఇతి। ధర్మగ్రహణముపలక్షణమ్‍। అధర్మస్యాపి ప్రతిషేధాత్మకో వేద ఏవ మూలమ్‍। నిషేధవిధయో హి బ్రహ్మహత్యాదౌ విషయే ప్రవృత్తం నివర్తయన్తి। న చ రాగద్వేషాదినా విషయే ప్రవృత్తస్తా నివర్తయితుం శక్యః। యద్యసౌ విషయోనుష్ఠితః ప్రత్యవాయహేతుర్న స్యాదితి నిషేధవిధిరేవ ప్రత్యవాయహేతుతాం గమయతి॥
అనువాదము
          ధర్మమనెడిది వేదమూలమని సూత్రార్థము। ధర్మమనగా అగ్నిహోత్రాదికర్మానుష్ఠానమువలన పుట్టెడి, అభ్యుదయము(వృద్ధి) నకు అటులనే పరంపరముగా మోక్షమునకు కారణమయ్యడి , ‘అపూర్వము’ అని పేరుగల్గిన ఆత్మగుణము. ఆత్మగుణమనగా శాస్త్రప్రకారము మనమనుభవించెడి సుఖదుఃఖద్వేషాదులు ఆత్మగుణములు. అటులనే ధర్మము కూడా ఆత్మగుణము అని వివరణము। ఇటువంటి ధర్మమునకు వేదము ప్రమాణము। వేదమనగా మన్త్ర(సంహితా)-బ్రాహ్మణాత్మకము। సూత్రమునందు ‘వేదః’ అని వేదశబ్దము ప్రథమైకవచనమున ప్రయోగింపబడినది, దానికి ఒకటే వేదముప్రమాణమని అర్థము కాదు, ఎందుకంటే నాలుగువేదాలకు ప్రామాణ్యము ఇష్టము। కావున ఇక్కడ ‘వేదః’ అని జాత్యేకవచనప్రయొగము, అనగా నాలుగు వేదములలో యుండెడి జాతి వేదత్వము ఒక్కటే, తద్వివక్షయా ఇక్కడ ఏకవచనప్రయొగము జేయబడినది। దానివలన ‘వేదః’ అని ప్రయొగించినా నాలుగు వేదాలు అని అర్థము వస్తుంది। కాబట్టి ఋగ్యజుస్సామాథర్వణములనెడి నాలుగు వేదాలు ధర్మమునందు ప్రమాణములు। వేదములు ధర్మప్రమాణములనటంవలన ఒకే విషయమునందు వేదమునందు ప్రమాణవాక్యము లభించుచుండగా అనుమానార్థాపత్త్యాదులు శాక్త్యాది ఆగమములు ప్రమాణములు కావు।  తథా చ వేదమూలములయిన ఉపనయనాదులే ప్రమాణభూతములు అవును, బౌద్ధమతప్రసిద్ధ- మయినచైత్యవందనాదులు కావు। వేదము ధర్మవిషయమునందుమాత్రమే కాక అధర్మమునందుకూడ ప్రమాణము, అనగా బ్రహ్మహత్యాది-అధర్మకారణములయిన కర్మల నిషెధమునందు కూడ వేదమే ప్రమాణము॥